నేను సైతం తెలంగాణ ఉద్యమం లో ముందుకెళ్తాను !
నేలకొరిగిన అమర వీరుల స్పూర్తితో.....
అనుక్షణం తెలంగాణాకై పని చేస్తున్న విద్యావంతులు,
కళాకారులు, రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థుల స్పూర్తితో......
నేను సైతం తెలంగాణ ఉద్యమం లో నిండిపోతాను !
రైతుల ఆత్మహత్యలు, లక్షల్లో వలస వెళ్తున్న పాలమూరు కూలీలు,
గల్ఫ్ లో చిక్కుకున్న అబాగ్యులు, ఎండిన భూములు,
మన్దిన కడుపులు...... ఎన్నాళ్లు ? ఇంకెన్నాళ్ళు ???
నేను సైతం తెలంగాణ ఉద్యమం లో కలిసిపోతాను
కళ్లి బొల్లి కబుర్లు, ఉత్తి మాటలు,
ఉట్తెక్కిన ఆశలు, రాజకీయ ఎత్తులు,
సాంస్కృతిక వెన్నుపోట్లు వొద్దు.....! ఇక వొద్దు........!!!
నేను సైతం తెలంగాణ ఉద్యమం లో ఊపిరౌతాను
మా భూములు, మా ఉద్యోగాలు,
మా నీళ్ళు, మా మాట,
మా బాష, మా యాస కావాలి ! మాకు కావాలి !
నేను సైతం తెలంగాణ ఉద్యమానికి ఊతమవుతాను
No comments:
Post a Comment