Tuesday, December 27, 2011

SAVE THE INDIAN RUPEE

SAVE THE INDIAN RUPEE YOU CAN MAKE A HUGE DIFFERENCE TO THE INDIAN ECONOMY BY FOLLOWING FEW SIMPLE STEPS:- Please spare a couple of minutes here for the sake of India . I got this article from one of my friends, but it's true. I can see this in day to day life. Here's a small example:- Before 12 months 1 US $ = INR Rs 39 After 12 months, now 1 $ = INR Rs 52.73 Do you think US Economy is booming? No, but Indian Economy is Going Down. Our economy is in your hands.... INDIAN economy is in a crisis. Our country like many other ASIAN countries, is undergoing a severe economic crunch. Many INDIAN industries are closing down. The INDIAN economy is in a crisis and if we do not take proper steps to control those, we will be in a critical situation. More than 30,000 crore rupees of foreign exchange are being siphoned out of our country on products such as cosmetics, snacks, tea, beverages, etc... which are grown, produced and consumed here. A cold drink that costs only 70 / 80 paise to produce, is sold for Rs.9 and a major chunk of profits from these are sent abroad. This is a serious drain on INDIAN economy. We have nothing against Multinational companies, but to protect our own interest we request everybody to use INDIAN products only at least for the next two years. With the rise in petrol prices, if we do not do this, the Rupee will devalue further and we will end up paying much more for the same products in the near future. What you can do about it? 1. Buy only products manufactured by WHOLLY INDIAN COMPANIES. 2. ENROLL as many people as possible for this cause..... Each individual should become a leader for this awareness. This is the only way to save our country from severe economic crisis. You don't need to give-up your lifestyle. You just need to choose an alternate product. All categories of products are available from WHOLLY INDIAN COMPANIES. LIST OF PRODUCTS COLD DRINKS:- DRINK LEMON JUICE, FRESH FRUIT JUICES, CHILLED LASSI (SWEET OR SOUR), BUTTER MILK, COCONUT WATER, JAL JEERA, ENERJEE, and MASALA MILK... INSTEAD OF COCA COLA, PEPSI, LIMCA, MIRINDA, SPRITE. BATHING SOAP:- USE CINTHOL & OTHER GODREJ BRANDS, SANTOOR, WIPRO SHIKAKAI, MYSORE SANDAL, MARGO, NEEM, EVITA, MEDIMIX, GANGA , NIRMA BATH & CHANDRIKA. INSTEAD OF LUX, LIFEBUOY, REXONA, LIRIL, DOVE, PEARS, HAMAM, LESANCY, CAMAY, PALMOLIVE. TOOTH PASTE:- USE NEEM, BABOOL, PROMISE, VICO VAJRADANTI, PRUDENT, DABUR PRODUCTS, MISWAK. INSTEAD OF COLGATE, CLOSE UP, PEPSODENT, CIBACA, FORHANS, MENTADENT. TOOTH BRUSH: - USE PRUDENT, AJANTA , PROMISE. INSTEAD OF COLGATE, CLOSE UP, PEPSODENT, FORHANS, ORAL-B. SHAVING CREAM:- USE GODREJ, EMAMI. INSTEAD OF PALMOLIVE, OLD SPICE, GILLETE. BLADE:- USE SUPERMAX, TOPAZ, LAZER, ASHOKA . INSTEAD OF SEVEN-O -CLOCK, 365, GILLETTE . TALCUM POWDER:- USE SANTOOR, GOKUL, CINTHOL, WIPRO BABY POWDER, BOROPLUS . INSTEAD OF PONDS, OLD SPICE, JOHNSON'S BABY POWDER, SHOWER TO SHOWER. MILK POWDER:- USE INDIANA, AMUL, AMULYA. INSTEAD OF ANIKSPRAY, MILKANA, EVERYDAY MILK, MILKMAID. SHAMPOO:- USE LAKME, NIRMA, VELVETTE. INSTEAD OF HALO, ALL CLEAR, NYLE, SUNSILK, HEAD AND SHOULDERS, PANTENE. MOBILE CONNECTIONS:- USE BSNL, AIRTEL INSTEAD OF HUTCH Food Items:- Eat Tandoori chicken, Vada Pav, Idli, Dosa, Puri, Uppuma . INSTEAD OF KFC, MACDONALD'S, PIZZA HUT, A&W . Every INDIANproduct you buy makes a big difference. It saves INDIA . Let us take a firm decision today. BUY INDIAN TO BE INDIAN - We are not against of foreign products. WE ARE NOT ANTI-MULTINATIONAL. WE ARE TRYING TO SAVE OUR NATION. EVERY DAY IS A STRUGGLE FOR A REAL FREEDOM. WE ACHIEVED OUR INDEPENDENCE AFTER LOSING MANY LIVES. THEY DIED PAINFULLY TO ENSURE THAT WE LIVE PEACEFULLY. THE CURRENT TREND IS VERY THREATENING. MULTINATIONALS CALL IT GLOBALIZATION OF INDIAN ECONOMY. FOR INDIANS LIKE YOU AND ME, IT IS RE- COLONIZATION OF INDIA . THE COLONIST'S LEFT INDIA THEN. BUT THIS TIME, THEY WILL MAKE SURE THEY DON'T MAKE ANY MISTAKES. WHO WOULD LIKE TO LET A "GOOSE THAT LAYS GOLDEN EGGS" SLIP AWAY? PLEASE REMEMBER: POLITICAL FREEDOM IS USELESS WITHOUT ECONOMIC INDEPENDENCE RUSSIA , S.KOREA , MEXICO - THE LIST IS VERY LONG!! LET US LEARN FROM THEIR EXPERIENCE AND FROM OUR HISTORY. LET US DO THE DUTY OF EVERY TRUE INDIAN. FINALLY, IT'S OBVIOUS THAT YOU CAN'T GIVE UP ALL OF THE ITEMS MENTIONED ABOVE. SO GIVE UP AT LEAST ONE ITEM FOR THE SAKE OF OUR COUNTRY! We would be sending useless forwards to our friends daily. Instead, please forward this mail to all your friends to create awareness. "LITTLE DROPS MAKE A GREAT OCEAN ."

తెలంగాణపై చంద్రబాబు దండయాత్ర

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నికల మేనిఫెస్టోలో మద్ధతు ప్రకటించి తీరా డిసెంబర్ 9 ప్రకటన రాగానే ప్లేటు ఫిరాయించిన చంద్రబాబుకు గత రెండేళ్లుగా తెలంగాణ ప్రాంతంలో పర్యటించేందుకు ధైర్యం చాలలేదు.

గతవారం సీమాంధ్రకు చెందిన ప్రైవేటు సైన్యాన్ని వెంటేసుకుని తెలంగాణపై దండయాత్ర మొదలుపెట్టాడు చంద్రబాబు.

మెదక్ జిల్లాలో ఆయన పర్యటన జరిగిన తీరుని చూడండి:




పారా మిలిటరీ బలగాలకు తోడు సీమాంధ్ర గూండాల రక్షణలో బాబు తెలంగాణ పర్యటన






పారా మిలిటరీ బలగాలకు తోడు సీమాంధ్ర గూండాల రక్షణలో బాబు తెలంగాణ పర్యటన






జీపుల్లో కర్రలతో సీమాంధ్ర తేదేపా గూండాలు






తెలంగాణ ప్రజలపై కర్రలతో సీమాంధ్ర తేదేపా గూండాల దాడి






తెలంగాణ ప్రజలపై కర్రలతో సీమాంధ్ర తేదేపా గూండాల దాడి






తెదేపా ఫ్లెక్సిలను, జెండాలను చించేస్తున్న ప్రజలు






తెదేపా ఫ్లెక్సిలను, జెండాలను చించేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు

Monday, December 26, 2011

WEBSITES FOR TELANGANA STATEHOOD

HERE ARE SOME OF THE WEBSITES HELPING TO PROMOTE TELANGANA STATEHOOD...WE ARE SENCERELY THANKFUL TO ALL OF THEM. -JAI TELANGANA http://missiontelangana.com/ http://www.telangana.com/ http://telangana.org/ http://ourtelangana.com/ www.namasthetelangaana.com/ namastetelangana.in http://www.simplytelangana.com

How NDTV “Manufactures” Anti-Telangana News

BY MISSIONTELANGANA – OCTOBER 8, 2011 POSTED IN: COVER STORY, MEDIA WATCH
NDTV seems to be adopting new methods of “manufacturing news”. The most recent example of how the news channel has completely misquoted Union Finance Minister Pranab Mukherjee on the Telangana issue, is a classic example of how NDTV “manufactures” news to suit its agenda. On October 5th, NDTV’s corresspondent Srinivasan Jain had interviewed Union Minister Pranab Mukherjee for a show “Truth Vs Hype”. Jain had asked several questions as a part of this interview of which 2 were related to the Telangana statehood issue. In spite of a very clear and detailed reply from Pranab on the Telangana issue, NDTV deliberately mis-quoted the senior minister. And when Pranab clarified to media persons that he had never said those words on NDTV, the channel, instead of correcting its news report, stooped further and telecast another story to portray that Pranab has “flip-flopped” on the Telangana issue. We at Mission Telangana thought that this kind of deliberate mis-reporting should not be excused. So, here are the facts behind NDTV’s story. Here is the link to the NDTV’s original story: http://www.ndtv.com/video/player/news/separate-telangana-state-could-create-more-problems-pranab/212781 And here is the transcript of that interview: — “The UPA’s lead fire fighter and crisis manager Pranab Mukherjee admitted that Telangana separate statehood could bring more problems. In an exclusive interview to NDTV’s show “Truth Vs Hype”, he has said that given that it is a highly emotive issue, it is hard to give a time frame” Sreenivasan Jain: Now the groups that are asking for a separate Telangana, which include members from all political parties, Pranab Mukherjee: Their party differences have been blurred…it is regional differences now. Sreenivasan Jain: So, those (Telangana) groups believe that the Congress is reneging on a public commitment that was made by the Home Minister, Saying that there will be a separate Telangana state. They believe thats a betrayal. Pranab Mukherjee: No, its not. Question is its always there has been some sort of…because the problem is so complex….that’s why from last 50 years it has not been resolved. The problem arose from the First SRC, there-after there has been Gentleman’s agreement, there has been six-point formula, there has been mulki rules, there have been developmental issues, and after all, in a larger context, if you look at, many more problems in future will come. Because formation of the Indian states, there was no pattern. Even in the contemporary history of say last 4-5 years…400-500 years, there was no pattern, how the states are formed. When the country became independent, whole south of Vindhyas were divided into two presidency provinces – Bombay Presidency and Madras Presidency. There was no state like Rajasthan during the British days. And when the country became independent. It was called Rajputana. Conglomeration of large number of princely states. So how these states have been formed over the years, is an interesting subject for study. And it has its problems. Sreenivasan Jain: Mr. Mukherjee, the concern is, the longer you delay, there could once again be violence, and violence or the fear of violence has what has led you to last time (many believe) to act under pressure. Are you fearing a repeat of that, this time around as well? Pranab Mukherjee: No, violence, fear and apprehension of the violence is there. Thats why we are appealing that come what may, try to avoid the violence and mass-frenzy sometimes creates a situation, where to control situation and maintain law and order becomes difficult. So we should try to avoid. Everybody. after all violence does not help everybody. — Any person, who can understand simple English would know what Pranab Mukherjee was trying to convey to Srinivasan Jain. The senior Congress man was trying to explain the NDTV correspondent that several remedies were tried to solve the Telangana problem in the past, and there is no pattern to forming new states in India, and that several new states have come up after India became independent and that there have been problems because of not having a pattern in state formation, and that Indian state formation process has its problems. No where did he say that Telangana state formation would lead to new state demands or new problems. But yet, NDTV went on repeating the story with sub-titles and commentary which read - “No easy solution” - “Telangana separate statehood could bring more problems” - “Easy solution not possible” - “It is hard to give a time-frame” If you read the transcript carefully, you would realize that none of these words were actually spoken by Pranab. Because of NDTV’s mis-reporting, other national and regional news papers added some more masala to the whole story. Some newspapers wrote that Pranab had indicated that conceding Telangana would open a pandora’s box (sic). Prominent Telugu daily Eenadu, which is known for its anti-Telangana stand, made a banner story out of those mis-reported NDTV story. (click on the image to see full-size)
A day after every media house made merry by writing stories over the mis-reported NDTV story, Union Finance Minister Pranab Mukherjee issued a clarification that he never said that Telangana statehood issue would provide fillip to other statehood movements. And NDTV, instead of correcting its earlier mistake, shamelessly telecast another story saying that Pranab Mukherjee has flip-flopped on the Telangana issue. See that shameless story here: http://www.ndtv.com/video/player/news/talks-on-telangana-still-on-says-pranab/213054 NDTV folks have shown only a few carefully edited words from the original interview to make the viewers believe their blatant lie. We at Mission Telangana severely condemn these cheap tricks from NDTV. We suspect that certain vested interests are at play behind this wilful distortion of facts. We would also like to caution the NDTV folks that Telangana region has a population of almost 4 crores and the people of this region would not tolerate any attempts by media houses to deliberately show the statehood movement in poor light.

ఇదీ ఈనాడు మార్కు ఎల్లో జర్నలిజం...

BY MISSIONTELANGANA – JULY 27, 2011 POSTED IN: MEDIA WATCH, OPINION నిన్న కేంద్ర హోంమంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుపై చేసిన ప్రకటన ఇది: “This is a unique situation where political parties in Andhra Pradesh are divided down the middle. Congress, Telugu Desam, CPI, CPI(M) are all divided. The only party which claims to be undivided is BJP because it has only one member” ఆ ప్రకటనను ఈనాడు పత్రిక ఇవ్వాళ పతాక శీర్షికలో వేసింది. ఒక సారి చదవండి: – ”తెలంగాణ అంశంపై అసాధారణ స్థాయిలో రాష్ట్రంలోని కాంగ్రెస్‌, తెలుగుదేశంలు నిట్టనిలువునా చీలిపోయాయి. చీలిపోలేదని చెప్పుకుంటున్న భాజపాకి ఉన్నది.. ఇద్దరే సభ్యులు. తెరాస, సీపీఐలు తెలంగాణకు పూర్తి అనుకూలం. ఈ స్థితిలో ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పార్టీలపై ఏదో ఒక పరిష్కారాన్ని బలవంతంగా రుద్దలేం” అని కేంద్ర హోం మంత్రి చిదంబరం స్పష్టం చేశారు.” – ఏదో తేడా ఉన్నట్టుంది కదూ. అదే మరి ఈనాడు చేసే పదాల కనికట్టు… తెలంగాణపై సీమాంధ్ర మీడియా చేసే దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఇందులో TV9 వంటివి బహిరంగంగానే విషం చిమ్మితే ఈనాడు వంటివి చాలా తెలివిగా తెలంగాణ గురించి దుష్ప్రచారం చేస్తాయి. నిన్న కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణపై చేసిన ప్రకటన తప్పుల తడక. వేరే పత్రికలన్నీ దాన్ని యధాతదంగా ప్రచురిస్తే ఈనాడు మాత్రం అందులోని తప్పులన్నీ దిద్దింది. హోం మంత్రి ప్రకటనలో ఎన్ని తప్పులున్నాయో ఇక్కడ చదవండి: http://missiontelangana.com/?p=1997 విలేకరుల సమావేశమయితే ఏ పత్రిక ఇష్టం వచ్చినట్టు అది రాసుకోవచ్చు. కానీ నిన్నటి చిదంబరం ప్రకటన పీటీఐ వార్తాసంస్థ పంపించిన ఫీడ్. కాబట్టి అన్ని పత్రికలూ పీటీఐ వాళ్లు పంపినదే యధాతదంగా ప్రచురించాలి. కానీ ఉన్నదున్నట్టు ప్రచురిస్తే తెలంగాణపై చిదంబరం బాద్యతారాహిత్యం ఎక్కడ బయటపడిపోద్దో అని ఈనాడు వారు దాన్ని సరిదిద్దారు. ఇదీ ఈనాడు మార్కు తెలంగాణ వ్యతిరేక ఎల్లో జర్నలిజం. అందుకే సీమాంధ్ర మీడియాను తెలంగాణ ప్రజలు బహిష్కరిస్తున్నారు –

నయా రాజకీయ ఊసరవెల్లి ఈ నాగబాబా!

లోక్ సత్తా అట్లాంటి ఇట్లాంటి పార్టీ కాదు, జయ ప్రకాష్ నారాయణ సాక్షాత్తూ ఈ దేశాన్ని ఉద్ధరించడానికి అవతరించిన కల్కి భగవానుడితో సమానం అని కొందరు నమ్ముతారు. నాగభైరవ జయప్రకాష్ నారాయణ కూడా చంకలో రాజ్యాంగాన్ని ఒక మత గ్రంధంలా పెట్టుకుని, అనేక వేదికల మీద (సందర్భం ఉన్నా లేకపోయినా) తాను చదివిన ఆంగ్ల పుస్తకాల్లోంచి కొటేషన్లను ధారాళంగా ఉటంకిస్తూ, తన రాజకీయ బాబా అవతరాన్ని రక్తి కట్టిస్తుంటారు. ఆధ్యాత్మిక భోదనల పేరుతో జనాలను మోసం చేసే బాబాల గుట్టు ఎన్నిసార్లు రట్టయినా సదరు బాబాల భక్తులు గొర్రెల్లా ఆయా బాబాలను నమ్ముతూనే ఉంటారు. నాగభైరవ బాబా భక్తులదీ అదే వరుస. ఆయన ఎంత అడ్డగోలుగా మాట్లాడినా, ఎన్నిసార్లు మాట మార్చి, తాను ప్రవచించే విలువలను పాతరేసినా ఆయన మాటే వేదం ఈ భక్త బృందానికి. నిన్న రాష్ట్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీపెట్టిన అవిశ్వాసంపై ప్రసంగిస్తూ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ఈ నాగభైరవుడు ఆకాశానికి ఎత్తేశాడు. అంతటితో ఊరుకోకుండా తాను ఓటింగులో పాల్గొననని, తటస్థంగా ఉంటానని చెప్పాడు. రెండు రోజుల కిందే ఈయన, ఈయన పార్టీ, అవిశ్వాసానికి మద్ధతు ఇస్తామని చెప్పిన మాట ఆయన పార్టీ పత్రిక ఇలా ఘనంగా అచ్చేసుకుంది చూసి తరించండి:
వోటు వజ్రాయుధమని రోజు అరిగిపోయిన రికార్డు వేసే లోక్ సత్తా నేత, నిన్న ఆ వజ్రాయుధాన్ని ఎందుకు వాడలేదో ఇప్పుడు ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. ప్రతిపక్ష, స్వంత పార్టీ ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా శాసనసభ లాబీల్లో టోకున బేరసారాలు జరుపుతున్న కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని నిర్లజ్జగా స్తుతించడానికి ఎంత ముట్టిందో ఇప్పుడు బహిర్గతం చేయాలి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టే నాగభైరవుడు ఇలా తెల్లారేసరికి ప్లేటు ఫిరాయించడం ఏ విలువ? ఇదే పని వేరే పార్టీ ఎమ్మెల్యేలు చేస్తే అమ్ముడుపోయారని దుమ్మెత్తిపోసేవారు ఇదే లోక్ సత్తా పార్టీ వారు. మరిప్పుడేం అంటారో? (మాకు తెలుసు ఇది చదివాక కూడా నాగ బాబాను ఆయన భక్తులు స్తుతిస్తూనే ఉంటారు. బాబాగారు ఊరికే ఏమీ చేయరు, ప్రతి పని వెనుకా ఏదో నిగూఢ కారణం ఉండే ఉంటుంది అని దబాయిస్తారు చూడండి)

పొట్టి శ్రీరాములును పొట్టనబెట్టుకున్నది ఎవరు?

సీమాంధ్ర నేతల క్షుద్ర రాజకీయాలకు బలైన అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన ఆత్మ త్యాగానికి ఒక్క రోజు ముందు తీసిందీ ఫొటో. — అబద్దాల పునాదుల మీద ఒక రాష్ట్రాన్ని నిర్మించబూనితే ఏమవుతుంది? ఆంధ్ర ప్రదేశ్ కి గత అయిదు దశాబ్దాలుగా ఏమవుతుందో అదే అవుతుంది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు అనేది పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం వల్లనేననే అబద్దం పునాదుల మీద సీమాంధ్ర నాయకులు తెలుగు జాతిని నిలబెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న ఈ సమయంలో కూడా డిసెంబర్ 15 నాడు పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రెండు నిముషాలు మౌనం పాటించాలనే సర్కులర్ జారీ చేసి తమ తోక వంకరని మరోసారి నిరూపించుకున్నారు సీమాంధ్ర పాలకులు. అయితే గత పదేళ్ల మలిదశ తెలంగాణ ఉద్యమం పొట్టి శ్రీరాములుకు, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటుకు ఏమీ సంబంధం లేదని కనీసం తెలంగాణ ప్రజలకు తెలియజెప్పగలిగింది. అసలు పొట్టి శ్రీరాములు ఆత్మ త్యాగం వెనుక పెద్ద కుట్రనే దాగి ఉందని, సీమాంధ్ర రాజకీయ నాయకుల స్వార్ధ రాజకీయాలకు ఆయన అన్యాయంగా బలైపోయాడని ఇప్పుడు దొరుకుతున్న తాజా సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి. తమ వ్యక్తిగత స్వార్ధం కొరకు ఒక నిండు మనిషి ప్రాణాలను అన్యాయంగా బలిపెట్టారని, అసలు పొట్టి శ్రీరాములు మరణం పూర్తిగా నివారించదగినదని మా దగ్గర ఉన్న సాక్ష్యాలు స్పష్టం చేస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎవరికీ తెలియకుండా తొక్కిపెట్టిన ఈ చీకటి కోణంపై MissionTelangana బృందం ప్రత్యేక కధనం: కధ మొదలవడానికి ముందు కొంచెం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు నేపధ్యం తెలుసుకోవాలి మనం: పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష ప్రారంభానికి దాదాపు రెండేళ్ల ముందే అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ (జవహర్ లాల్, వల్లభాయి పటేల్, పట్టాభి సీతారామయ్య-జె.వి.పి కమిటీ) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయమని సిఫార్సు చేసింది. మద్రాస్ నగరంపై మాత్రం ఆంధ్రులు తమ హక్కు వదులుకోవాలని ఆ కమిటీ అభిప్రాయపడింది. ఈ కమిటీ సిఫారసులను ఆంధ్ర ప్రాంత ప్రజానీకం పెద్ద వ్యతిరేకత లేకుండానే ఒప్పుకుంది. ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ అయితే నవంబర్ 12, 1949 నాడు విజయవాడలో సమావేశం అయి జె.వి.పి. కమిటీ సిఫారసులకు అమోదముద్ర వేస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది.
ఆ తీర్మానం అమోదించిన వారిలో ప్రకాశం పంతులు, కళా వెంకట్రావు, బులుసు సాంబ మూర్తి, ఎన్ జి రంగా వంటి హేమాహేమీలు ఉన్నారు. ఈ తీర్మానంతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అప్పటివరకూ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని అటు తమిళులూ ఇటు తెలుగు వారూ సంతోషించారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పంపకాలు చేయడానికి మద్రాస్ ప్రభుత్వం డిసెంబర్ 7, 1949 నాడు 8 మంది సభ్యులతో కూడిన పార్టీషన్ కమిటీని నియమించింది.
అందులో అంధ్ర తరఫున ప్రకాశం పంతులు, వెంకట్రావు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డిలు ఉండగా, తమిళుల తరఫున కుమార స్వామి రాజా, భక్తవత్సలం, మాధవ మీనన్, టి.టి. కృష్ణమాచారి ఉన్నారు. పార్టీషన్ కమిటీ మద్రాసు నగరం లేకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని జనవరి 26,1950 నాటికి ఏర్పాటు చేయాలని, ఆంధ్రకు వేరే రాజధాని నిర్మించాలని, మద్రాసు ప్రభుత్వం ఆంధ్రకు ఒక కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని నివేదిక ఇచ్చింది. దీన్ని ఆమోదించిన మద్రాసు ప్రభుత్వం ఏప్రిల్ 1, 1950 నాటికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలుగు వారికొరకు ఒక రాష్ట్రం ఉండాలని, మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడివడాలనే కోరిక 1910ల నుండే ప్రారంభమైనా వివిధ కారణాల వల్ల ఆ స్వప్నం నిజం కావడానికి నాలుగు దశాబ్దాల కాలం పట్టింది. అయితే ఈ ఆలస్యానికి చాలా వరకు కారణం బయటివారుకాక అప్పటి ఆంధ్ర నాయకుల మధ్య ఉన్న అపనమ్మకాలు, విభేధాలు, పరస్పర నమ్మకరాహిత్యం కావడమే విషాదం. చూడడానికి అంతా హేమాహేమీలే అయినా తమతమ వ్యక్తిగత అహాలు, స్వార్ధాల కారణంగా ఆనాడు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కుక్కలు చింపిన విస్తరిలా తయారయ్యింది. కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టు పార్టీ, ప్రజా పార్టీ, కృషికార్ పార్టీ, ఆంధ్ర మహాసభ, కిసాన్ మజ్దూర్ సభ…ఇలా అనేక పార్టీలు, సంస్థలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించే క్రమంలో రాష్ట్ర ఏర్పాటు ఒక కొలిక్కి రాకుండా చేశారు. చివరికి కేంద్ర ప్రభుత్వం, మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం రెండూ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించినా, కొందరు ముఠాకోర్లు మద్రాస్ నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలనే డిమాండును తెరపైకి తెచ్చి రాష్ట్ర ఏర్పాటును జటిలం చేసుకున్నారు. పొట్టి శ్రీరాములు మరణానికి ప్రధానంగా నలుగురు సీమాంధ్ర నేతలు కారణమని అప్పటి ఘటనల క్రమం చూస్తే ఇట్టే అర్థం అవుతుంది. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ప్రకాశం పంతులు గురించి. స్వాతంత్రం రాకపూర్వమే మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆయన, తన మొండిపట్టుదల వల్ల ఏడాదికాలం కూడా ఆ పదవిలో కొనసాగలేకపోయాడు. చివరికి అప్పటి నెహ్రూతో కూడా విభేదించి కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చి ప్రజా పార్టీ అనే పార్టీని స్థాపించాడు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పంపకాలు చేయడానికి 1949లో ఏర్పాటైన పార్టీషన్ కమిటీలో, ఏడుగురు సభ్యులు మద్రాసు నగరం లేకుండా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతిస్తే, ప్రకాశం పంతులు మాత్రం చెన్నపట్నం లేకుండా ఆంధ్ర రాష్ట్రం వద్దని తిరకాసు పెట్టాడు. అయితే ఆనాడు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని ప్రజలకు మాత్రం మదరాసు నగరంపై పెద్ద వ్యామోహమేమీ లేదు. ఏదో ఒకలాగా రాష్ట్రం వస్తే చాలని ప్రజలనుకుంటుంటే, ప్రకాశం వంటి నాయకులేమో 1950, 1951 సంవత్సరాలు మొత్తం మద్రాసు నగరంతో పాటు ఆంధ్ర రాష్ట్రం కావాలని, లేదా మద్రాసును చీఫ్ కమీషనర్ స్టేట్ (కేంద్రపాలిత ప్రాంతం) చేయాలని ప్రకటనలు గుప్పించసాగారు. (ఇప్పుడు సీమాంధ్ర నాయకులు హైదరాబాదును కేంద్రపాలితప్రాంతం చేయాలని అనడం వెనుక నేపధ్యం అర్థం అయ్యిందా?) ఈ నాయకుల వలెనే మద్రాసులో పుట్టి పెరిగిన పొట్టి శ్రీరాములుకు కూడా మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కావాలనే కోరిక ఉండేది. అటు తమిళ, ఇటు తెలుగు నాయకులు మద్రాసు నగరంపై పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో నెలలు గడుస్తున్నా అసలు సమస్య పరిష్కారం కాకపోవడంతో విసుగుచెందిన పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహారదీక్ష ద్వారా మద్రాసు భవితవ్యాన్ని తేల్చాలని నిర్ణయించుకున్నాడు. అక్టోబర్ 20 1952 నాడు బులుసు సాంబమూర్తి ఇంటిలో పొట్టి శ్రీరాములు తన ఆమరణ దీక్ష మొదలుపెట్టాడు. ఆ సందర్భంగా ఆయన స్పష్టంగా మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కొరకే తాను దీక్షకు కూర్చున్నట్టు ప్రకటించాడు.
(ఆంధ్రప్రభ నుండి) — అయితే ఇక్కడొక విషయం గమనించాలి. తెలుగువారికి మద్రాసు నగరంతో అనుబంధం ఉన్నమాట నిజమైనప్పటికీ ఏ విధంగా చూసినా వారికి ఆనాడు ఆ నగరం దక్కే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆనాటికి మద్రాసు నగరంలో తమిళులే అధికం. దానికి తోడు అనేక ఏళ్ల నుండి ఉమ్మడి మదరాసు రాష్ట్రానికి రాజధానిగా ఉన్న మదరాసు నగరాన్ని వదులుకోవడానికి తమిళులు ఒప్పుకునే ప్రశ్నే లేదు. ఇక మదరాసు నగరం తెలుగువారికే హక్కుభుక్తం కావాలని మొదటినుండీ మంకుపట్టు పడుతున్న టంగుటూరి ప్రకాశం పంతులు వాదన ఎంత అర్ధరహితమో ఒక ఉదాహరణ చెప్పాలిక్కడ. 1952 జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మదరాసు నగరంలోని హార్బర్ నియోజకవర్గం నుండి శాసనసభకు ప్రకాశం పంతులు పోటీచేసాడు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి కృష్ణారావు గెలవగా, రెండో స్థానంలో నిలిచిన ఇబ్రహీం అనే ఇండిపెండెంటుకు 11 వేల ఓట్లు వస్తే, అప్పటికే మహా నాయకుడిగా, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో కీలక వ్యక్తిగా నిలిచిన ప్రకాశం పంతులు 7 వేల ఓట్లు మాత్రమే తెచ్చుకుని డిపాజిట్ కూడా దక్కక చిత్తుచిత్తుగా ఓడిపోయాడు.
Source – Election Commission of India మరి ఇలాంటి పరిస్థితిలో మదరాసు నగరం తెలుగువారికి దక్కుతుందని ప్రకాశం వంటి ఆంధ్ర నాయకులు ఎలా అనుకున్నారు? ఇక పొట్టి శ్రీరాములు దీక్ష ప్రారంభం అయిన మరునాడే అప్పటి తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు పి. సుబ్బరాయన్ చెన్నపురి (మద్రాసు) ను వదులుకుంటే ఆంధ్ర రాష్ట్ర నిర్మాణం సులభం అవుతుందని ప్రకటించాడు. కానీ, దీక్ష మొదలైన రెండో రోజు నీలం సంజీవరెడ్డి మదరాసు నగరాన్ని ప్రత్యేక కమీషనర్ రాష్ట్రంగా (కేంద్రపాలిత ప్రాంతం)గా ప్రకటించాలని డిమాండ్ చేశాడు. శ్రీ రాములు దీక్ష మొదలైన వారం రోజులకు రాష్ట్రోద్యమంలో చురుకుగా ఉన్న ప్రధాన పార్టీ అయిన కమ్యూనిస్టు పార్టీ మొదట పరిస్థితి తీవ్రతను గ్రహించింది. నిర్వివాద ప్రాంతాలతో (మదరాసు లేకుండా) వెంటనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ కమిటీ తీర్మానించింది.
(ఆంధ్రప్రభ నుండి) — అయితే అదే రోజు ప్రకాశం పంతులు, తెన్నేటి విశ్వనాధం వంటి నాయకులు మాత్రం ఇంకా మదరాసులో అరవవారికన్నా తెలుగువారే అధికంగా ఉన్నారనే అసంబద్ధపు ప్రకటన చేశారు. అక్టోబర్ 27 నాడు పార్లమెంటు సభ్యుడు లంకా సుందరం నిర్వివాద ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం నిర్మించి మదరాసును కేంద్రపాలిత ప్రాంతం చేయాలని రాష్ట్రపతిని కోరాడు. అక్టోబర్ 28 నాడు బులుసు సాంబమూర్తి కూడా ఒక సభలో మాట్లాడుతూ మదరాసును కేంద్రపాలిత ప్రాంతం చేసి ఆంధ్ర రాష్ట్రం ప్రకటించాలని డిమాండ్ చేశాడు. ఇక పొట్టి శ్రీరాములు దీక్ష మొదలైన 10 రోజులకు అన్నిటికన్నా ఘోరమైన విషయం జరిగింది. అప్పటిదాకా మద్రాసు లేకుండా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించిన ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. రెండేళ్ల కిందటి తీర్మానానికి మద్ధతు పలికిన నేత నీలం సంజీవరెడ్డి ఇప్పుడు ప్లేటు ఫిరాయించి మదరాసుపై ఆంధ్రులు హక్కును వదులుకోరని ప్రకటించాడు. అంతే కాదు ఇంకో అయిదేళ్ల వరకూ ఆంధ్ర రాష్ట్రం వచ్చే పరిస్థితి లేకపోవడం వల్లనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సమర్ధించుకున్నాడు.
(ఆంధ్రప్రభ నుండి) — ఎంత దుర్మార్గమో చూడండి. ఒకవైపు నిరాహార దీక్షకు కూర్చున్న పొట్టి శ్రీరాములు ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణిస్తున్న వేళ సాక్షాత్తూ నీలం సంజీవ రెడ్డే ఇంకో అయిదేళ్ల వరకూ రాష్ట్రం రాదని చెబుతున్నాడు. మరి అటువంటి పరిస్థితులో పొట్టి శ్రీరాములు దీక్ష కొనసాగిస్తుంటే దాన్ని ఆపకుండా ఎందుకు ఉన్నట్టు? అక్టోబర్ 30, 1952 నాడు మదరాసులో జరిగిన లా కాలేజి విద్యార్ధుల సభలో పలువురు ఆంధ్ర రాష్ట్ర నేతలు, మేధావులు పాల్గొన్నారు. ఆనాడు సభకు అధ్యక్షతవహించిన ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ “ఒక కొసన ఉన్న చెన్నపురి (మదరాసు) ఆంధ్ర రాష్ట్రనికిగాని, తమిళ రాష్ట్రానికిగానీ ముఖ్యపట్టణంగా పనికిరాదనీ, చెన్నపురి తమకు దూరం కాబట్టి తాము ఒరిస్సాలో చేరగలమని శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలవారు అనవచ్చునని కాబట్టి చెన్నపురి సమస్యను రాష్ట్ర నిర్మాణానికి ప్రతిబంధకం కానివ్వరాదని అన్నారు. పొట్టి శ్రీరాములు దీక్ష కొనసాగినన్నాళ్ళూ ఆయన ప్రాణాలు రక్షించడానికి పాపం నార్ల గారు చేయని ప్రయత్నం లేదు. ఆనాడు ఆంధ్ర ప్రభ తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ గలిగిన పత్రిక. తన పత్రికలో రోజూ వార్తలు, కార్టూన్లు, సంపాదకీయాల ద్వారా ప్రకాశం వంటి ఆంధ్ర నాయకుల మూర్ఖపు, నిర్హేతుక వైఖరులను, ఫట్టుదలలను విమర్శించేవారు నార్ల వెంకటేశ్వరరావు గారు. అయితే ఆంధ్ర రాష్ట్రోద్యమ నాయకులు మాత్రం ఎవరి హితోక్తులూ వినలేదు. రోజులు గడుస్తున్నా, పొట్టిశ్రీరాములు ఆరోగ్యం ఆందోళనకరంగా మారుతున్నా పట్టించుకోకుండా ఇటు ప్రకాశం పంతులు, అటు నీలం సంజీవరెడ్డిలకు తోడు దీక్ష వేదికగా తన ఇల్లును ఇచ్చిన బులుసు సాంబమూర్తి, ఇంతకు ముందొకసారి ఆంధ్ర రాష్ట్రం కొరకు దీక్షచేసి విరమించిన స్వామిసీతారాం – ఈ నలుగురూ వివిధ వేదికలపై మదరాసు నగరంపై వింతవింత వాదనలు చేయడం మొదలుపెట్టారు. మచ్చుకు 30 అక్టోబర్, 1952 నాడు లా కాలేజీ విద్యార్ధుల సభలో నీలం సంజీవరెడ్డిగారు అన్న ఈ ఆకుకు, పోకకు అందని ఈ వ్యాఖ్యలు చూడండి. “అపుడూ మదరాసుపై హక్కులు వదులుకున్నాం అని చెప్పాం, కానీ అది అరవలకు ఇస్తున్నామని అంగీకరించలేదు….మదరాసులో అరవలు ఎక్కువ ఉన్నారని ఒప్పుకోవచ్చు, కాని, అరవేతరులు అంతకన్న ఎక్కువ కనుక మదరాసును అరవలు కోరరాదు…మదరాసు అరవలకు, ఆంధ్రులకు ఉమ్మడిగానుంటే కష్టమేమిటి? మదరాసులో వారు చెప్పినట్లు అరవలు 80మంది ఉన్నా, 16గా ఉన్న ఆంద్రుల హక్కులు కాపాడడానికైనా, అది ఉమ్మడిగా ఉండాలి” చూశారుగా, ఇది చూస్తే ఇప్పుడు సీమాంధ్ర నేతలు తెలంగాణపై చేసే అడ్డగోలు వాదనలు గుర్తుకురావట్లేదూ? ఇటు ఆంధ్ర నేతలు, అటు తమిళ నేతలు మదరాసు నగరంపై సవాళ్లూ ప్రతిసవాళ్లూ విసురుకుంటూ, పొట్టి శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి విషమిస్తుండటం చూసి, మదరాసు యువజన ఫెడరేషన్ కు చెందిన కేశవలాల్ తరవాది అనే గుజరాతి యువకుడు చేసిన ఈ హెచ్చరిక చూడండి.
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి) — 6 నవంబర్, 1952 నాడు మదరాసు నగరంలో సమావేశమైన ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు తక్షణమే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని, మదరాసును ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. దీనికి సరిగ్గా వారం రోజుల ముందు తమిళ కాంగ్రెస్ పార్టీ మదరాసుపై తెలుగు వారికి ఎట్టి హక్కు లేదని తీర్మానం చేయడం గమనార్హం.
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి) — పొట్టి శ్రీరాములు గారి దీక్ష మొదలై దాదాపు నెలగడిచాక మదరాసులో ఆంధ్ర విద్యార్ధి విజ్ఞానసమితి వారి విజ్ఞానోత్సవం సభలో పాల్గొంటూ ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు ఒక గొప్ప మాట చెప్పారు. “ఇక మదరాసు సమస్య ఇటీవల వచ్చింది. దీనికోసం పోట్లాడుకుంటూ కూర్చుంటే, పొలంగట్టు కోసం దావాలకు దిగి, ఖర్చులకోసం పొలం అమ్ముకున్నట్లవుతుంది. ఆంధ్ర రాష్ట్రం సంపాదించడం మన ప్రధాన సమస్యా లేక మదరాసు సంగతి తేల్చడం ప్రదాన సమస్యా? అని ఆలోచించాలి. మదరాసు గురించి మనవారు సూచిస్తున్న మూడు ప్రతిపాదనలతో మదరాసు ఆంధ్ర రాష్ట్రంలో భాగం కాదని రుజువవుతున్నది. మనదీ అనడానికి దమ్ములు లేక, చెరిసగం అని, ప్రత్యేక రాష్ట్రమని, అరవలకు పోరాదని అంటునారు, కనుక, వివాదం లేని ప్రాంతాలతో రాష్ట్రం తీసుకొని, తరువాత తక్కినవాటికై పోట్లాడాలని, నెహ్రూని లొంగదీయగల ఉద్యమం నేడు లేవదీయలి. దానికి విద్యార్ధులు పూనుకోవాలి” డిసెంబర్ మొదటి తారీఖు కల్లా పొట్టి శ్రీరాములు ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. 3వ తారీఖునాడు ఆచార్య ఎన్ జి రంగా, నల్లారెడ్డి నాయుడు, వి. రాజగోపాలరావు, ఎన్ శేషయ్యగార్లతో కూడిన నలుగురు పార్లమెంటు సభ్యుల బృందం వెంటనే నిర్వివాద ప్రాంతాలతో (మదరాసు లేకుండా) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసి పొట్టి శ్రీరాములు ప్రాణాలు కాపాడాలని ప్రధాని నెహ్రూకు ఒక లేఖ రాసింది.
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి) — పొట్టి శ్రీరాములు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఆంధ్ర నాయకులంతా డిసెంబర్ 7 నాడు ఒక అత్యవసర అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశం జరిగేనాడు ఆంధ్రప్రభ ఎడిటర్ నార్ల వెంకటేశ్వరరావుగారు తన దినపత్రికలో ఆంధ్ర నాయకులు ఇలాగే జాగుచేస్తే పొట్టి శ్రీరాములు ప్రాణాలు కాపాడుకోవడం కష్టమని అత్యంత ఆవేదనతో ఇలా రాశారు:
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి) — కానీ కొండకు (మదరాసుకు) వెంట్రుక (పొట్టి శ్రీరాములు ప్రాణం) కట్టి లాగుతున్నాం, వస్తే కొండ వస్తుంది, పోతే వెంట్రుక పోతుంది అన్న చందాన వ్యవహరించారు అప్పటి సీమాంధ్ర నాయకులు. ఆనాటి సభలో ప్రకాశం పంతులు చాలా అన్యాయంగా ప్రవర్తించాడు. ఆద్యంతం నవ్వుతూ, చలోక్తులతో, జోకులేస్తూ ప్రసంగించాడు. దీక్ష మొదలుపెట్టాక తాను పొట్టి శ్రీరాములును ఒక్కసారి మాత్రమే కలిసానని చెప్పుకున్నాడు. ఆయన ప్రసంగంలో ఈ వాక్యం చూడండి: “గత కొలది దినాలుగా ఆయన పరిస్థితి ప్రమాదంలో పడింది. ఏ క్షణంలో అయినా ఆయన ప్రాణం కాస్తా హరీ అనవచ్చు. అప్పుడు ఆంధ్ర దేశంలో, మద్రాసు నగరంలో ప్రజలలో ఉద్రేకం విపరీతంగా పెరిగిపోవడం తధ్యం” పొట్టి శ్రీరాములు ప్రాణాల పట్ల ఆంధ్ర రాష్ట్రోద్యమ ముఖ్య నాయకుడిది ఎంత నేరపూరిత నిర్లక్ష్యమో చూశారా? ఈ సభలో ప్రకాశంతో పాటు అనేక మంది ఆంధ్ర నాయకులు మళ్ళీ పాత పాటనే పాడారు. మదరాసుతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని, కుదరని పక్షంలో మదరాసును కేంద్రపాలిత ప్రాంతం చేసి ఉమ్మడి రాజధానిగా అన్నాఉంచాలని ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని గౌతు లచ్చన్న వంటి కొంత మంది ఆంధ్ర నాయకులు, ముఖ్యంగా కమ్యూనిస్టులు తీవ్రంగా వ్యతిరేకించారు. సభలో ఇరు పక్షాలూ కేకలు వేసుకున్నారు. ప్రకాశం పంతులు, తరిమెల నాగిరెడ్డి అయితే వేదికపైనే పరస్పరం వాదనలకు దిగారు. చివరికి వేదికను ఎక్కిన ప్రముఖ కమ్యూనిస్టు నేత తరిమెల నాగిరెడ్డి మాట్లాడుతూ: ఈ తీర్మానం కనుక ఆమోదిస్తే రాష్ట్ర ఏర్పాటు 50 సంవత్సరాలు వాయిదా పడుతుందని, ఈ తీర్మానం వల్ల రాష్ట్రమూ రాదు, శ్రీరాములు గారి ప్రాణమూ రక్షించడం సాధ్యం కాదన్నారు. చివరికి మందబలంతో ప్రకాశం పంతులు వాదనే నెగ్గింది. ఆ సభలో అమోదం పొందిన తీర్మానం ఒకవిధంగా పొట్టి శ్రీరాములు మరణశాసనం! డిసెంబర్ 9 నాడు స్టేట్ కౌన్సిల్ లో మాట్లాడుతూ నిర్వివాద ప్రాంతాలతో (మదరాసు లేకుండా) ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రధాని నెహ్రూ ప్రకటించాడు.
(ఆంధ్రప్రభ దినపత్రిక నుండి) అయినా ఆంధ్ర నాయకులు తమ మూర్ఖపు పట్టుదల విడువలేదు.

YADIREDDY LETTER - JAI TELANGANA


ఆత్మహత్యకు ముందు యాదిరెడ్డి రాసి పెట్టి పోయిన ఉత్తరమిది.... జై తెలంగాణ సోనియా గాంధీజీ హమారా తెలంగాణ హమ్కో దేదో. మేరా ఆఖ్రీ ఇచ్చా హై. సోనియాజీ, రాహుల్జీ, ప్రధాన్మంత్రీజీ మేరా లాష్కో దేఖ్కే దేశ్ కా ప్రెస్ వాలొంకో మేరా విన్నప్ హై కీ ఆప్కా వీడియో కెమెరాస్ హమారా తెలంగాణ తరఫ్ మీడియా శ్రీ కృష్ణ కమిటీ 8 చాప్టర్ దేశ్ కా సామ్నే రఖియే. జై తెలంగాణ హైద్రాబాద్లో ట్రేన్ ఎక్కే ముందు ఎన్నో విధాలుగా ఆలోచించిన. నేనేప్పుడో అనుకున్న 17-07-2011 లోపు ఎలాంటి ప్రకటన రాకుంటే ఢిల్లీ వెళ్లి ప్రాణత్యాగం చెయ్యాలని. నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్న. ఎందుకో నా మనసు శాంతంగా ఉంది. అమ్మతో మాట్లాడిన. చెల్లితో కూడా మాట్లాడినా. ఇక్కడికి వచ్చేముందు అమ్మను చూసి, అమ్మ చేతివంట కడుపు నిండా తిని, అమ్మ ఆశీర్వాదం తీసుకుని వద్దామనుకున్నా. కానీ నా లక్ష్యం కోసం ఎక్కడ వెనుకడుగు వేస్తానో అని భయం వేసి వెళ్లలేదు. నేను హైద్రాబాద్లో ట్రైన్ ఎక్కేసరికి ఏమీ అర్థం కాలే. ఈ ప్రాంతాన్ని వదిలి పోతున్న. నేను ఎన్నో కలలు కన్న నా తెలంగాణను వీడిపోతున్న. మనసంతా భాద. నిజం చెప్పాలంటే నాకు తెల్వకుండనే ఇక్కడికి వచ్చిన. మనసులో ఒక్కటే ఉన్నది. ఇంకేం ఆలోచిస్తలేదు. నేను అనుకున్నది సాధిస్తా. అనుకున్నది చేస్తా. తెలంగాణ విముక్తి కోసం నేను ఉద్యమంలో ఒక బిందువునైతా. తెలంగాణ ప్రజలు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నరు. అదే సీమాంధ్రలో ఎవడో చెబితే చేస్తున్నరు. ఇక్కడ తెలంగాణ వాళ్లకు ఒక్కటే తేడా. తెలంగాణలో ఉద్యమం తెలంగాణ కోసం చేస్తున్నరు. సీమాంధ్రల చేపిస్తున్నరు. స్వచ్ఛందంగా చేయడం లేదు. ఎవడో లగడపాటిలాంటి కుక్కలు ఉసిగొలిపితే చేస్తుండ్రు వారు. తెలంగాణ ఎందుకు కావాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. అదే సమైక్యాంధ్రకు కారణం ఒకటే చెబుతరు. అభివృద్ధి ఇది తప్ప వాళ్ల దగ్గర ఇంకేమీ ఉండదు. రుచి మరిగిన కుక్కలు ఊరికెనే వదులుతాయా, తరిమి కొట్టాలే, తరిమి తరిమి కొట్టాలె. అప్పుడే తెలంగాణకు శాంతి. తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ వేరు కావాల్సిందే. మా భూమి, మా కొలువులు, మా నీళ్లు మాకు న్యాయంగా దక్కాలె. కాని ఇప్పుడు జరుగుతుంది వేరు. అనుబవించుడు వాళ్లు. అభివృద్ధి చేసినం అని చెప్తుండ్రు. అన్యాయంగా దోచుకునుడు తప్పితే, ఏం లేదు. తెలంగాణ రావాలని తెలంగాణ మొత్తం ఎదురుచూస్తున్నది. దొంగ దానం నాగేందర్, సర్వే, జైపాల్ రెడ్డి లాంటి ద్రోహులు తప్ప. వీళ్లు దొంగలల్ల కలిసిండ్రు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం. బయటి కన్నా ఇంటి దొంగలే ఎక్కువ మోసం. జైపాల్రెడ్డి గారూ, మీరు నా నియోజకవర్గం అని చెప్పకోవడానికి సిగ్గుపడుతున్నా. తెలంగాణ కోసం మీరు రాజీనామా చేసి ఉంటే మిమ్మల్ని దేవుని లెక్క చూస్తుండె. తెలంగాణ ప్రజల ప్రాణాల కంటే మీకు పదవి ఎక్కువైంది. మీకు ఓట్లు వేసిన ప్రజలే మీ పేరు చెబితే చీదరించుకుంటున్నారు. ఇప్పటికైనా రాజీనామా చెయ్యాలె. మిగితావాళ్లను చేసే విధంగా ఒప్పియ్యాలె. తెలంగాణ కన్నా ఏదీ ఎక్కువ కాదు. దానం నాగేందర్, ముఖేశన్నకు నా విజ్ఞప్తి. మీరు తెలంగాణ ద్రోహులుగా ముద్రపడ్డరు. ఇప్పటికన్నా ఇక్కడి ప్రజల ఆకాంక్షను మీరు గుర్తించండి. మనల్ని మనమే తిట్టుకుంట సీమాంధ్ర నాయకులకు తొవ్వ చూపిస్తున్నము. తెలంగాణ కోసం నేను నా ప్రాణం ఇస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. నేను కోరుకునేది ఒక్కటే. అందరూ ఒక్కటి కావాలె, తెలంగాణ సాధించాలె. తెలంగాణ కోసం ముందుకు రాని వాళ్లను ఎవరూ ఏమనొద్దు. కానీ తెలంగాణ దెబ్బ ఎట్లుండాలంటే వాళ్లు మల్లా ఎసుంటి పదవి కాదు, వాళ్ల రాజకీయమే నాశనం అయ్యేటట్లు చెయ్యాలె. తెలంగాణ వాళ్లు ఓట్లు వెయ్యకపోతే సీమాంధ్ర నుండి ఇక్కడికి వచ్చిన వాళ్లు ఓట్లు వేస్తరని మీరు అనుకోవచ్చు. కానీ వాళ్లు కూడా తెలంగాణకు అనుకూలం అని మీరు మరిచిపోకుండ్రి. సోనియాగాంధీజీ సోనియాగాంధీ గారు మీరు తెలంగాణ ప్రాంతంలో సీమాంధ్ర నాయకులు అడ్డంగా సంపాదించిన ఆస్తుల గురించి ఆలోచిస్తున్నరు. మీరు మౌనం వీడండి. తెలంగాణ ఇవ్వండి. నాకు చాలా భయంగా ఉంది. మీ పార్టీ తెలంగాణల రోజుకో డ్రామా ఆడుతున్నరు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇప్పటికీ నమ్మే పరిస్థితి లేదు. వాళ్లు రాజీనామా చేసినా, నిరాహార దీక్ష చేసినా మీరు చేపిస్తున్నరని అందరి అనుమానం. తెలంగాణల ఇప్పటి వరకు 600 మందికి పైన విద్యార్థులు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిండ్రు. మిగితా సోదర సోదరీలను కలిపితే ఆ సంఖ్య వెయ్యి దాటుతదేమో. సీమాంధ్రులతో మేము ఇంకా అయిదు, పది ఏండ్లు ఉంటే మా తెలంగాణ ఉనికికే ప్రమాదం. తెలంగాణనా ఎక్కడి తెలంగాణ. ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ అని అనే పరిస్థితి వస్తది. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర మంటగలిసి పోతది. తెలంగాణ, తెలంగాణ ప్రజలు బాగుండాలంటే తెలంగాణ ఇచ్చి తీరాల్సిందే. తెలంగాణ వనరులు తెలంగాణ ప్రజలకు దక్కాలంటే తెలంగాణ వేరు కావాల్సిందే. తెలంగాణల ఉద్యమం మీ పార్టీ చేతులకు పోతదేమో అని భయంగా ఉంది. నాయకులు, తెలంగాణ ప్రజలు మొత్తం తెలంగాణ కావాలని కోరుకుంటున్నరు. అలుపెరుగని ఉద్యమం చేస్తున్నది మా తెలంగాణ మాకు ఇవ్వండి. మాకు విముక్తి ఇవ్వండి. ప్రధానమంత్రిగారూ, మా తెలంగాణను అడిగితే అంతమంది పోలీసులు ఎందుకు? మరి తెలంగాణ పాకిస్థాన్ బార్డరా? బంగ్లాదేశ్ బార్డరా? మేము వేరే దేశం అడుగుతలేం. భారత రాజ్యాంగానుసారం మా హక్కును అడుగుతున్నం. మా హక్కుని అడిగితే అణిచివేస్తుండ్రు. ఇదెక్కడి న్యాయం. తెలంగాణ ప్రజలు భారతీయులు కారా? తెలంగాణ ప్రజలు తమకు అన్యాయం జరిగింది కాబట్టే మా తెలంగాణ మాకు ఇయ్యమని అడుగుతున్నరు. అయినా కొత్తగా రాష్ట్రం అడుగతలేము. ఉన్న తెలంగాణను ఇయ్యమంటున్నం. మీరు మమ్మలను సంతోషంగా బతకాలని కోరుకుంటే వెంటనే తెలంగాణ ఇయ్యండి. సీమాంధ్ర ప్రజలు మా తెలంగాణల స్థిరపడిన వాళ్లు తెలంగాణల పూర్తి స్వేచ్ఛగా బతుకుతున్నరు. ఉంటరు. కొందరు దొంగ నాయకులు వాళ్లకు లేనిపోని మాయమాటలు చెప్పి భయభ్రాంతులకు గురిచేస్తున్నరు. వాళ్ళు సంఘవిద్రోహులకింద లెక్కనే. సీమాంధ్ర నాయకులకు గాని అధికారులకు గాని వాళ్ల పెట్టుబడులు న్యాయబద్ధం అయితే భయమెందుకు? వాళ్లు అన్యాయంగా ఆస్తులు సంపాదించిండ్రు. అందుకే భయం. ఇగ వాళ్ల మీడియా తెలంగాణ సింగపూర్ లెక్క ఉన్నదని చూపిస్తరు. వాస్తవం ఏంది అనేది వాళ్లకు తెలుసు. తెలంగాణ ప్రజలు అసలు సిసలైన భారతీయులు. అందుకే శాంతియుతంగా గొప్ప మార్గంలో ఉద్యమిస్తున్నరు. ఎవరన్నా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వాళ్లను ఏమీ అనడం లేదు. ఇప్పటి వరకు మా నాయకులనే మేము అన్నంగానీ వాళ్లను గుడ్లతో, టమాటాలతో కొట్టలేదు. ప్రధానమంత్రిగారూ... మా తెలంగాణ మాకు ఇవ్వండి. తెలంగాణను విముక్తి చేయండి. సీమాంధ్రవాళ్లు మా కొలువలల్ల అన్యాయంగా ఉన్నరు. మా నీళ్లను మళ్లించుకున్నరు. మా వనరులను దోచుకున్నరు. మా తెలంగాణ పదవులు వాళ్లే అనుభవిస్తున్నరు. తెలంగాణ భూములలో 60 శాతం వాళ్ల చేతులల్లనే ఉన్నయి. ఇది పెద్దమనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించి చేసిందే. అయనా ఇప్పటివరకు తెలంగాణకు దేంట్లో న్యాయం జరిగిందని? ముల్కి నిబంధనలు అమలు కాలే. దొంగ జీవో 610 అమలుకాలే. తెలంగాణకు అన్యాయం జరిగింది. జరుగుతూనే ఉన్నది. ఇప్పటికన్నా తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ మనుగడే ప్రశ్నార్థకం అయితది. వాళ్లు మా ప్రాంతంను కబ్జా చేసిండ్రు. మా కుటుంబాలను కూడా కబ్జా చేస్తున్నరు. నా కుటుంబంలనే ఒక ఆంధ్రది వచ్చింది. మా నాయన సావుకు కారణమైంది. నా నాయనమ్మకి విషమిచ్చి చంపించింది. ఇప్పుడున్న మా నాన్న తమ్ముడిని ఏదో ఒక రోజున సంపుతది. మాకు వాళ్ల ఆస్తి అక్కరలేదు. ఆయన బాగుంటే చాలు. హైద్రాబాద్లో ఉన్న భూములు ఎక్కడికి పోయాయి. ప్రభుత్వ భూములు ఎట్లా అన్యాక్రాంతం అయ్యాయి. అవి ఎవరి చేతుల్లో ఉన్నాయి. హైద్రాబాద్ సీమాంధ్రతో కలిసినప్పుడు ఎలాంటి షరతులు విధించిండ్రు. అవి ఎంతవరకు అమలు జరిగినయి. తెలంగాణకు ఇప్పటి వరకు ఏ అభివృద్ధి మండలి న్యాయం చేసంది. ఇప్పటి వరకు ఎన్ని కమిటీలు వేసిండ్రు. ఏ కమిటీ అమలు కాలే. తెలంగాణకు అన్యాయమే జరిగింది. 610 అన్నరు. ముల్కి అన్నరు. ఏవీ అమలు కాలేదు. సీమాంధ్ర నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా తెలంగాణ ఇయ్యాల్సిందే. మాకు ఏ అభివృద్ధి మండలి వద్దు. తెలంగాణ కావాలే. హైద్రాబాద్ రాజధానిగా ఉండాలె. హైద్రాబాద్ తెలంగాణ సొత్తు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ అభివృద్ధి చెందింది అని అంటున్నరు. మరి అభివృద్ధి మండలి ఎందుకు అంటే వాళ్లే చెబుతున్నరు తెలంగాణ వెనుకబడి ఉన్నదని. మాకు ఏ మండలి వద్దు. ఏ ప్యాకేజీ వద్దు. తెలంగాణ కావాలే. సీమాంధ్ర ప్రజలంటే తెలంగాణ వాళ్లకు ఎలాంటి ద్వేషంకాని, పగకాని లేవు. అట్లుంటే ఉద్యమం ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు కూడా వాళ్లతో కలిసిమెలిసి ఎట్లుంటరు? వాళ్ల దగ్గర పనికి ఎందుకు పోతరు? వాళ్లతో కలిసి దందాలు ఎందుకు చేస్తరు? సీమాంధ్రుల మీద నిజంగా కోపం ఉంటే వాళ్లు మా హైద్రాబాద్ల ఉండేటోళ్లా? ప్రతీ సీమాంధ్ర నాయకులకు ప్రజలకు తెలుసు హైద్రాబాద్ తెలంగాణ గుండె అని. సీమాంధ్ర ప్రజలకు కూడా వాళ్లక సొంత రాజధాని కావాలని ఆకాంక్ష ఉన్నది. కానీ కొందరు దొంగ నాయకులు సీమాంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నరు. సీమాంధ్ర ప్రజలు ఇప్పటికైనా మీరు సొంత రాజధానిని నిర్మించుకొండి. మీరు మా శత్రువులు కాదు. మీరు అంతో ఇంతో చాలా బాగున్నరు. మీ నాయకులు మాకు అడ్డుపడకుండా వాళ్లను నిలదీయండి. మద్రాసు నుండి హైద్రాబాద్, ఇక్కడి నుండి ఇంకో దగ్గరికి ఎందుకు? ఇట్లా మీకు సొంత రాజధాని ఉంటే చాలా బాగుంటది. హైద్రాబాద్ తెలంగాణ సొత్తు. తెలంగాణ రక్తం, తెలంగాణ శ్రమతో నిర్మిచబడ్డది. తెలంగాణ నుండి హైద్రాబాద్ వేరు అనే ఊహ కూడా భరించలేం. తెలంగాణల మీ డ్రామా ఆపెయ్యండి. తెలంగాణ కోసం ఇంకో ఒక్క చావు. నేను బూడిదవుతున్నాను. తెలంగాణల ఒక్క ప్రాణం పోకూడదు. అట్ల పోకూడదంటే తెలంగాణ ఇయ్యండి. తెలంగాణ కోసం నాదే చివరి బలిదానం కావాలె. ఇంక ఎవ్వరూ ప్రాణం తీసుకోవద్దు. తెలంగాణను మీరు ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది. నేను ఇద్దరిని క్షమించమని అడుగుతున్న అమ్మా నన్ను క్షమించు. నేను తెలంగాణ కోసం వెళ్లిపోతున్నాను. నిన్ను నేను చాలా బాధపెట్టిన ఇందు నన్ను మన్నించు. ఇన్ని రోజులు నాకు తోడుగా ఉన్నావు. నీకు అన్యాయం చెయ్యలేను. నాకు ఏం చెయ్యాలో అర్థం అయిత లేదు. జై తెలంగాణ

చెక్కు చెదరని మీ చెప్పులేసిన చరిత్ర!

నాడు ‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అన్నాడొక మహానుభావుడు. కాని నేడు ‘రాష్ట్రమంటే రాతిబొమ్మలేనోయ్ రాలిపోయే ప్రాణులు కాదోయ్!’ అని అంటున్నారు వన్నెతగ్గని కుహనా ప్రజాస్వామిక, సాంస్కృతిక-సాహిత్య దురంధరులు.
.
కూలిన విగ్రహాల గురించి నిరసనలు, నివాళులు, లెంపలేసుకోవడం మరియు పాలాభిషేకాలు చేసి కన్నీరు పెట్టుకోవడం కడు శోచనీయం. వారి దూషణలు మిక్కిలి గర్హనీయం. ఐదున్నర దశాబ్దాల దోపిడి, ఆరాచక మరియు నియంతృత్వపు వలసవాద పాలన నుండి విముక్తికై పోరాడుతూ, తమ ప్రాణాలనే ఫణంగా పెట్టి మంటల్లో కాలి బూడిదవుతున్న ఆ త్యాగమూర్తుల కంటే తమది కాని అన్య మూర్తుల ప్రాముఖ్యత సమయానికందిరాని ఆలోచన.
.
పాలకుల తుపాకుల నుండి వర్షించే తూటాలు, ఇనుప బూట్ల తొక్కుల్లు మరియు లాఠీల విలయతాండవంతో నెత్తురోడి నేల రాలిన ఆ భావి కుసుమాల గురించి ఒక్క కన్నీటి చుక్క రాల్చి సానుభూతి తెలిపే, మానవత్వం మూర్తిభవించిన సాటి తెలుగువారలె లేకపోయిరి కదా!
.
అణచివేతలతో, ఆధిపత్యపు ఆగడాలతో దెబ్బ తిన్న జీవుల కళ్ళలోంచి నీళ్ళకు బదులు నిప్పులు, హృదయంలోంచి ప్రేమకు బదులు ద్వేషం పుడుతుందనే నగ్న సత్యం విజ్ఞులకు తెలియంది కాదు. దాని పర్యవసానమే ట్యాంక్ బండ్ ఘటనలు.
.
ఇది గ్రహించక పుండు మీద కారం జల్లినట్లు ‘అమానవీయమని, తెలుగు వారు తలదించు కోవాలని, దున్న పోతులూ సిగ్గు పడతాయని, చరిత్ర క్షమించదని, దోషులను ఉరి తీయాలని’ ఎన్నెన్నో సూక్తులు వినిపించారు కుహనా సంగీత-సాహిత్య-సాంస్కృతిక సామ్రాట్లు.
.
మరి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని విశ్వ వ్యాప్తంగా చాటి చెప్పి అందుకు ప్రతీకగా నిలిచిన మహానుభావుడు కీ.శే. నందమూరి తారక రామారావు మీద చెప్పులు విసిరి అవమానం చేసిననాడు ఈ తెలుగు జాతి ఎక్కడ విశ్రాంతి తీసుకుందో?
.
ఆ దోషులను శిక్షించక పోగా నిసిగ్గుగా ఓట్లు వేసి రాజ్యాధికారాన్ని అప్పగించిన ఘనత మీకే చెల్లింది కాబోలు. చివరకు ఏ ఆదరణకు నోచుకోక ఆ మహనీయుడు కృశించి దిక్కులేని చావు చచ్చిన మాట వాస్తవం కాదా?
.
ఇక మరో తెలుగు ముద్దు బిడ్డ కీ.శే. పి.వి. నరసింహారావు గారి మీద కర్నూల్ లో చెప్పులు విసిరి తమ తెలుగు సంస్కృతీ అభిమానాన్ని దశ దిశల చాటిన ఆ ఘనత మీకే సొంతం. అట్టి కార్యక్రమ వ్యూహకర్తలకు శాపనార్థాలు, శిక్షలు ఉండకపోగా మంత్రులు-ముఖ్యమంత్రులను చేసి ఆనందపడిన చరిత్ర మీకు మాత్రమే వున్నది.
.
ఇంతగా గొంతు చించుకుని, గుండెలు బాదుకునేవారు ఈ మధ్య బరంపురంలో జరిగిన తెలుగు మహాసభలో తెలంగాణ కవి నందిని సిద్దా రెడ్డి మీద భౌతిక దాడి జరిగినప్పుడు ఎందుకు ఖండించలేదు? ప్రసార సాధనాలు ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదు?. అతను సిమాంధ్ర రాతిబొమ్మ పాటి విలువ చేయరు కాబోలు.
.
ఇగ త్రివర్ణ పతాక సృష్టి కర్త పింగళి వెంకయ్య చరిత్ర తిరగవేస్తే మరీ దుర్భరం. ఆ దేశభక్తుడి ఆర్ధిక పరిస్థితి దిగజారిపోయి ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా కడు పేదరికంతో కనుమూశాడు. అప్పుడు ఏలిన వారికిగాని, అనామకులను, అవినీతిపరులను ఆదుకుని సత్కరించే తెలుగు సంస్థలు గాని, సంఘాన్ని ఉద్దరించే ఆపన్న హస్తాలు ఎక్కడికి అదృశ్యం ఆయ్యాయో తెలియదు. మరో దారుణం ఏమిటంటే పింగళి వెంకయ్య కుమారుడు పింగళి దశరథరాం ఎందుకు చంపబడ్డాడు? ఎవరు చంపారు? దోషులు ఎలా మాయమయ్యిండ్రు? దీనిపైన ఈ తెలుగు జాతి గళం విప్పలేదెందుకు? ధర్నాలు, పోరాటాలు చెయ్యలేదేందుకు?
.
పదిరికుప్పం, కారంచేడు మరియు చుండూరు హత్యలు గుర్రం జాషువా గౌరవార్థం జరిగినవేనా? ఈ కుహనా ప్రజాస్వామిక వాదులు, సాహితీ వేత్తలు తమ నిసిగ్గు ద్వంద ప్రమాణాలు ఇక నైనా మానడం మంచిది. అంతెందుకు ఈ మధ్య రోశయ్య ముఖ్యమంత్రిగా పదవి చేపట్టగానే సీమాంధ్రలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఎన్ని ద్వంసం అయ్యాయో చెప్పక్కర్లేదు.
.
మరి ఆ రోజు పెకిలిన గొంతులెన్ని? ఖండించిన ప్రజాసంఘాలెన్ని? ప్రశ్నించిన మానవతావాదులేరి?.
.
ఆగడం చేస్తే జగడం ఆగదు సరికదా ఇంకా ఉదృతం అవుతుంది. పది సంవత్సరాల పసి బాలుడి నుండి పండు ముదుసలికి తప్పని బైండోవర్లు, కాలికి చెప్పులు లేకుండా రచ్చబండకు రమ్మనడం, లేదంటే ఊర్ల దిగ్బంధనం, ఇండ్లు, బండ్లు, గొడ్డు గోదను తగులబెట్టడం…
.
ఇదేనా ప్రజాస్వామ్యం?
.
ఇదేనా సోదరభావం?
.
చావడానికి యావత్ తెలంగాణ సిద్దం అయ్యింది గాని భాష పేరుతో బానిసత్వానికి, కులంపేరుతో కుటిల రాజకీయానికి ఏ మాత్రం సహకరించడానికి సంసిద్దులుగాలేరనే నగ్న సత్యాన్ని వలస పాలకులు గుర్తుంచుకోవాలి. లేదంటే ప్రజల కోపాగ్నికి ఆహుతి గాక తప్పదు.
.
నియంతల చరిత్రనుండి నిజాలు తెలుసుకుని హుందాగా నిష్క్రమించడం ఉత్తముల లక్షణం.
.
“భక్తుడి కోపానికి భగవంతుడికే భంగపాటు తప్పలేదన్న సత్యం జగత్వ్యాపితం”.

The divide that won’t be bridged..!

The Telugu people’s agitation for a separate state and their leader’s death by hunger strike led in 1953 to the creation of Andhra state, made up of the two Telugu regions of Madras province: Coastal Andhra, and Rayalaseema. The third Telugu region — Telangana — had been part of the Nizam’s state of Hyderabad since 1724.
The States Reorganisation Commission recommended, in 1955, that Telangana, in excellent financial health, be a separate state. It had been incorporated into the Indian Union in September 1948 after the Indian Army ended the Nizam’s rule. Democratic elements in the region were not strong enough to assert themselves and the will of the people was not apparent.
The Andhra state was in financial distress and quarrels began over the implementation of the Sri Bagh pact between its two regions. Merger with Telangana was essential for its financial survival, and to provide diversion from its conflicts. The immature Telangana leadership was browbeaten into a merger in 1956 based on conditions to protect Telangana’s interests, as stated in a “gentleman’s agreement”.
The result of the merger was to: first, consolidate the Congress’ hold, and reduce that of the Communist Party, over the new Andhra Pradesh; second, unite coastal Andhra’s and Rayalaseema’s interests; third, reinforce the dominant (in Rayalaseema and Telangana) Reddy community’s political control; and fourth, to initiate projects in Andhra based on Telangana’s surpluses.
By 1969, the diversion of Telangana revenues and mal-allocation of government jobs provoked Telangana students into agitating for a separate state. and hundreds of students died in police firing. In the 1971 General Election, the Telangana Praja Samithi Party (TPS) secured 11 of the 14 Telangana parliamentary seats. The appointment of a chief minister from Telangana (P.V. Narasimha Rao) and the merger of the TPS with the Congress was intended to solve this crisis. But coastal Andhra and Rayalaseema politicians started the “Jai Andhra” movement in 1973 and demanded the protection of Andhra state; the “Jai Andhra” crisis was sorted out with more guarantees to Telangana — including a constitutional amendment and a presidential order — which were not implemented fairly.
Since 1969, many young people in Telangana joined the Naxalite movement to protest the region’s continued underdevelopment. This was exploited by the Telugu Desam Party (TDP) — backed predominantly by the Kamma caste in the Coastal Andhra — to win support in Telangana, and defeat the Reddy-dominated Congress in 1983. The Congress later also sought support of Naxalites in Telangana. Ultimately, a bi-partisan approach of TDP and Congress ensured the elimination of the Naxalite insurgency by 2005. Meanwhile, Telangana development had suffered for three decades.
The Telangana issue resurfaced with the formation of the Telangana Rashtra Samithi (TRS) in 2001. Before the 2004 general election, Congress — allied with TRS — promised Telangana statehood, which the incumbent TDP government opposed. Congress won by massive majorities. Despite the agreement of national parties in 2005 to statehood, the Congress did not fulfill its electoral promise, and the TRS broke away as a result.
Before the 2009 general election, Congress once again reiterated its commitment to statehood. TDP did the same, and allied with TRS. While the Congress lost electoral support, it managed to retain power. After the death of its chief minister, Y.S.R. Reddy, in late 2009, the issue snowballed as nearly 600 Telangana youths committed ritual suicide for the cause, and the TRS leader, K. Chandrasekhar Rao, started a fast-unto-death. In December 2009, an all-party meeting and the Congress legislative party both recommended statehood. Based on these developments, the government of India announced its decision to create the state to both Houses of Parliament.

At this stage, vested interests from Coastal Andhra and Rayalaseema that had illegally and irregularly acquired government land in and around Hyderabad city, organised opposition in New Delhi against Telangana statehood. The government of India was “persuaded” to delay the matter and set up the Srikrishna committee (SKC) to “examine” the issue in 2010. This postponed the implementation of the decision for a year, but the unsatisfactory nature of the report caused resumption of the agitation in 2011.
The polity and society in the state is split. The speaker of the assembly rejected a series of mass resignations of MLAs — from all three regions and all parties — thereby avoiding a legislative crisis. Further resignations are pending; many more anticipated. The resignations of 10 out of the 14 Congress MPs from Telangana are pending too. The existence of the UPA government, with its “non-majority” of 261 seats in the Lok Sabha, is threatened. The existing caste divide in the state — Reddy and Kamma — now re-emerged on regional lines: Kamma dominance in coastal Andhra, a Reddy hold on Rayalaseema, and OBC strength in Telangana. The Rayalaseema demand for a separate state indicates, further that a trifurcation of the state — rather than just bifurcation — is inevitable.

ధీర వనిత చాకలి (చిట్యాల) ఐలమ్మ...


తన చరిత్రను తాను తిరగరాసుకుంటున్న తెలంగాణ నేడు మరుగున పడేసిన అణిముత్యాలను వెలికి తీస్తున్నది. ముళ్లకంచెలు సాపుచేసి పోరుదారులేసిన త్యాగధనుల్ని తలకెత్తుకుంటున్నది. వివక్షాఫూరిత సీమాంధ్రుల పాలనలో స్మరణకు నోచుకుండా పోయిన సాహస వీరులకు, వనితలకు సలాం చేస్తున్నది. భూమికోసం, భుక్తి కోసం, పాలకుల పీడన నుంచి విముక్తి కోసం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. ఈ పోరాటానికి నిట్టాడుగా నిలిచి, ఉద్యమ స్ఫూర్తిని ఊరూరా పంచి తమ సర్వస్వాన్ని తెలంగాణ కోసం ధారపోసిన ధీర వనిత చాకలి (చిట్యాల) ఐలమ్మ.
1946- 51 మధ్యకాలంలో సాగిన సాయుధ పోరులో ఐలమ్మ భర్త జైలు పాలయ్యిండు. కొడుకు ఉద్యమంలో అమరుడయ్యిండు.
బిడ్డ దొరల దాష్టీకానికి బలయ్యింది. అయినా సుత ఐలమ్మ ధైర్యం చెడకుండ తన భూమికోసం, పండించిన పంట దక్కించుకునేందుకు కమ్యూనిస్టులతో కలిసి కొట్లాడింది. ప్రాణహాని ఉన్నప్పుటికీ ఒక్కతే అటు జనగాం, ఇటు హైదరాబాద్ వరకు తిరిగి అర్జీలు ఇచ్చింది. న్యాయం కోసం బరిగీసి నిలిసింది. చాకలి ఐలమ్మ , ఆమె కుటుంబం మొత్తం తమ భూమి తమకే దక్కాలని, పంట తమకే దక్కాలని విసునూరు దేశ్ముఖ్కు వ్యతిరేకంగా పోరాటం చేసింది. జైలుకు పోయింది. రక్తాలు కారేలా దెబ్బలు తిన్నరు. ఇంతజేసినా ఈ మట్టి మనుషుల గురించి, వీరి త్యాగాల గురించి పాఠ్యపుస్తకాల్లో ఎక్కడా ప్రస్తావన ఉండదు. నిస్వార్థ త్యాగానికి ప్రతీక అయిన ఆమె ప్రతిమకు ట్యాంక్బండ్పై స్థానం దక్కలేదు. ఇన్నాళ్లు, ఇన్నేండ్లు తెలంగాణ తన చరిత్ర తాను నమోదు చేసుకోలేకపోయింది. ప్రాంతేతరులు రాసిన రాతలే ప్రామాణికమయ్యాయి.
తెలంగాణ ఇప్పుడు ఒక్కొక్కటి లెక్కగట్టి మరీ రికార్డు చేస్తోంది. 1944లో ఆంధ్ర మహాసభ సమావేశాలు రావి నారాయణడ్డి ఆధ్వర్యంలో భువనగిరిలో జరిగిన నాటి నుంచే ఉద్య మం అతివాదుల చేతుల్లోకి పోయింది. బద్దం ఎల్లాడ్డి, దేవులపల్లి వెంక వంటి ప్రముఖులు ముందుండి ప్రజాచైతన్యానికి పునాదులు వేసిండ్రు. కమ్యూనిస్టుల నేతృత్వంలో ప్రజాచైతన్యం కోసం అనేక కళారూపాల్ని వాడుకున్నరు. బుర్రకథ, ఒగ్గు కథ, గొల్లసుద్దులు ఇట్లా ఎట్లా వీలైతే అట్లా ప్రజలను పోరుకు సన్నద్ధం చేసే కార్యక్షికమం ప్రారంభమైంది. వీటి ద్వారా ప్రభావితులైన చిట్యాల (చాకలి) ఐలమ్మ 45 ఏండ్ల వయసులో జనగామ తాలూకాలోని పాలకుర్తిలో విసునూరు దేశ్ముఖ్ గూండాలకు ఎదురుతిరిగింది.
1946 జూలై నాలుగున దొడ్డి కొముర య్య అమరత్వంతో అప్పటి నల్లగొండ జిల్లాలోని జనగామ తాలూకాలో అన్ని గ్రామాలు ఉద్యమానికి ఊపిరి పోసినయి. పాలకుర్తి, విసునూరు, కడ ఉద్యమ కేంద్రాలుగా రగిలినయి. పాలకుర్తిలో చాకలి (చిట్యాల) ఐలమ్మ, ఆమె భర్త నర్సింహ్మ, కొడుకులు సోమయ్య, లచ్చయ్యలు అందరూ ఉద్యమానికి బాసటగా నిలిచిండ్రు. ఆంధ్రమహాసభ నేతృత్వంలో ప్రజాచైతన్యం కోసం చిన్న సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, పాటలు పాడడం, బుర్రకథలు, ఒగ్గుకథలు చెప్పడం పరిపాటి. పాలకుర్తిలో ఆంధ్రమహాసభ బృందం సభ ఏర్పాటు చేసి, బుర్రకథలు చెబుతుండగా విసునూరు దేశ్ముఖ్ గుండాలు మిస్కీన్ అలీ, గుమస్తా అబ్బాస్ అలీ, వుత్తాలం రామిడ్డి, ఒనమాల వెంకడు తదితరులు అడ్డుకోవడానికి ప్రయత్నించిండ్రు. అయితే ప్రజలు వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుచేసి తప్పతాగి ఉన్న గూండాలకు శాస్తి చేసి పంపిండ్రు. దీంతో విసునూరు దేశ్ముఖ్ ప్రేరణతో పోలీసులు ఒనమాల వెంకటి మీద హత్యాయత్నం చేసింవూడనే నేరం ఆరోపిస్తూ చిట్యాల ఐలమ్మ భర్త నర్సింహ్మను ఆయన ఇద్దరు కొడుకుల్ని అరెస్టు చేసి జైలుకు పంపిండ్రు.
జనగామ మున్సిఫ్ కోర్టు, మెదక్ సెషన్స్ కోర్టుల్లో విచారణ జరిగింది. విచారణ ఏడాది కాలంపాటూ సాగింది. నర్సింహ్మతోపాటు హత్యాయత్నం కేసు ఎదుర్కొంటున్న 12 మంది ఆ కాలమంతా జైళ్లలోనే మగ్గిపోయారు. బెయిలు కూడా దొరకలేదు. ఇదే అదనుగా విసునూరు దేశ్ముఖ్ ఐలమ్మ పంటను స్వాధీనం చేసుకుందామని ప్రయత్నం చేసిండు. అయితే ఈ పంటకు నిర్మాల, కడ సీతారాంపురానికి చెందిన ఆంధ్రమహసభ కార్యకర్తలు కాపలాగా నిలిచిండ్రు. మూడు,నాలుగు నెలలపాటు కాపలా ఉన్న వీరందరికీ ఊరోళ్లందరి నుంచి బువ్వడొక్కొచ్చి పెట్టింది ఐలమ్మ. అయితే వీళ్లు కాపలా మానుకున్న వెంటనే దొర గూండాలొచ్చిండ్రు. అందిన కాడికి దోచుకోవడమే గాకుండా ఇంటి కి నిప్పుపెట్టిం డ్రు. తను, తన భర్త, కొడుకులు కష్టపడి పండించిన పంటను విసునూరు దేశ్ముఖ్ తరలించుకు పోదామని ప్రయత్నిస్తే ‘సంగం’ అండతో ఐలమ్మ అడ్డుకున్నది.
తరతరాలుగా తమ కుటుంబం సాగు చేసుకుంటున్న నాలుగెకరాల భూమి ఐలమ్మ కుటుంబం ఆస్తి. (మల్లంపల్లి దేశ్ముఖ్ (కరణం) నుంచి కౌలుకు తీసుకున్నది) వెట్టిచాకిరికి వ్యతిరేకంగా సంగం నేతృత్వంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకోవడంతో ఆ బాధను అనుభవిస్తున్న ఐలమ్మ కుటుంబం కూడా సంగంలో చేరి వాటి కార్యకలాపాల్లో పాలుపంచుకున్న ది. ఇది గిట్టని విసునూరు దేశ్ముఖ్ ఐలమ్మ భూమిపై కన్నేసి దానిని కాజేయాలని ప్రయత్నించిండు. విసునూరు పోలీసులు ఐలమ్మ ఇంటిమీద దాడి చేసి కొడుకును అరెస్టు చేసి చిత్రహింస పెట్టడమేకాకుండా ఇంట్లో ఉన్న సామాన్లన్నింటిని పలగ్గొట్టి మొత్తం ఇంటికే నిప్పుపెట్టిండ్రు. న్యాయం కోసం ఆమె హైదరాబాద్లో ఉన్న అధికారులను కలిసి విన్నపాలు జేసుకున్నది. ఎక్కడికైనా ధైర్యంతో ఒక్క తే పోయి వచ్చేది.
ఆమె ప్రాణానికి హాని ఉన్నప్పటికీ బేఖాతరు చేస్తూ న్యాయం కోసం జనగాం నుంచి హైదరాబాద్ వర కు వెళ్ళి అధికారులను కలిసింది. పోలీసు దెబ్బలకు భర్త కాలు చేయి పనిజెయ్యకుంటయి తర్వాత చనిపోయిండు. ఐలమ్మకు మొత్తం అయిదుగురు కొడుకులు, ఒక బిడ్డ. పచ్చి బాలింతగా ఉన్న బిడ్డపై దొరల తాబేదార్లు అత్యాచారానికి ఒడిగట్టిండ్రు. ఉద్యమంలో పాల్గొన్న ఒక కొడుకు అమరుడయిండు. అయినా ధైర్యం కూడగట్టుకొని సంఘానికి అండగా నిలిచింది. ఈమెకు అండగా ఆరుట్ల లక్ష్మీనరసింహాడ్డి, ఆరుట్ల కమలాదేవి నిలిచిండ్రు. కమలాదేవిపై కూడా ఇదే విషయంలో కోర్టులో కేసు దాఖలు కావడంతో ఇద్ద రు కలిసే పేషీలకు హాజరయ్యేటోళ్ళు.
1900 ప్రాంతంలో పుట్టిన చిట్యాల (చాకలి) ఐలమ్మ పేరుమీద సంగం వాళ్లు పాటలు రాసిండ్రు. పాడిండ్రు. ఉయ్యాల పదం పాడిండ్రు. ఆమెను బాల నాగమ్మ అని వర్ణించిండ్రు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం, పంట కోసం, అందరి బాగు కోసం, సంగం రాజ్జెం కోసం తమ సమస్తాన్ని ధారపోసిన ఐలమ్మ త్యాగం అనితర సాధ్యం. ఆమె సాహసం నేటి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి . నాటి మహిళల ‘సంగం’ ఉద్యమానికి ఊపిరులూదిన ఐలమ్మ పోరాట పటిమ నిరంతరం తెలంగాణ ఉద్యమానికి దారి చూపుతూనే ఉన్న ది. జీవితకాలంలోనే భర్తను ముగ్గురు కొడుకుల్ని పోగొట్టుకున్న ఐల మ్మ 1985 సెప్టెంబర్ పదిన తనువు చాలించింది.
ఇన్ని త్యాగాలు చేసిన వీరనారి ఐలమ్మ విగ్రహం ఆంధ్ర సర్కార్ ట్యాంక్బండ్ మీద పెట్టలేదు. పాఠ్య పుస్తకాలల్ల పెట్టలేదు. ఇప్పుడు మనం తెలంగాణ వచ్చేవరకు తెగించి కొట్లాడాలె. ఐలమ్మ అసువంటోల్లకు చరిత్రలో తగిన స్థానం కల్పించాలె. ప్రతి ఒక్కరూ పట్టుబట్టి పనిచేయాలె. తెలంగాణ సాధించాలె. అమరుల ఆశలను నెరవేర్చాలె. సబ్బండ జాతికి సంపద దక్కాలె.

ఎందుకు జరుపుకోవాలి నూతన సంవత్సర ఉత్సవాలు..?

ఎందుకు జరుపుకోవాలి నూతన సంవత్సర ఉత్సవాలు
మరో వసంతం కాలక్రమం లో కనుమరుగైన్దన
తపనల బరువు పెరిగిన తరువునుండి
మరో ఆశలనిండు పండుటాకు రాలిపోయిన్దన
గతం లోని జ్ఞాఫకలు నిన్ను గమనిస్తూ ఉండగానే
బావిష్యత్తును ఉహత్మక దొంతరలలోన దొర్లించటనిక
ఎందుకు జరుపుకోవాలి
ఒక్క పుటనైన నిరూ పెదకు తిండి పెట్టని
ఈ నిషి రాత్రి నిబిడ ఆశ్చర్య పూ ఉత్సవాన్ని
సగటు మనిషి జీవితాన్ని మార్చలేని
మధ్యపుటేరుల ప్రవహోత్సవాన్ని
ఎం మధుర స్మృతులను మిగిల్చిందాన్ని
జరుపుకుందాం
ఉద్యమాల ఉసులో ఉపిరి వదిలిన విద్యార్థుల
కుటుంబాల్లో విషాదం విడువడక ముందే
నింగికి ఎగిసిన నిత్య అవసరాల భారంనుండి
మధ్యతరగతి మనిషి బయటపడక ముందే
వర్షం సృష్టించిన భిబాత్సం నుండి
బాదితులు తేరుకోక ముందే
విచ్చుకున్న విభజన చిచ్చు ఎటు తేలకముందే
ఎలా జరుపుకోవాలి
కలబోతల కలుపుగోలుతనం తో కలిసున్నమన
తిరస్కారపు తిసివేతలతో తిరుగుతున్నమనా
ఎం పొందమని జరుపుకోవాలి
ఎం మరబోతుందని మహోతరంగా జరుపుకోవాలి
కరిగిపొయెది కాలమే కాని కష్టాలు కాదు
మరేది కేలండర్ లోని అంకెలేకాని
మనుషుల హృదయాలు కాదు
వికసించే ప్రతి కుసుమం రాలి పోవాల్సిందే
అరంబమైన ప్రతి సంవత్సారం అంతరించిపోవాల్సిందే
కాలగమనం లో ఎన్నో వసంతాలు వస్తుఉంటయి
కాల గర్బంలో కలిసి పోతూనేఉంటాయి
అందుకే నిషి రాత్రి ఉత్సవం
నిరుపేద కడుపు నింపిననాడు
మద్యం కోసం పెట్టిన రూపై మాములు మనిషి
జీవితాన్ని మహోన్నతం చేసిననాడు
విషాదం నిండిన జీవితాలలో
వెలుగు రేఖలు ప్రసరించిననాడు
నిష్క్రమణ లేని నుతనోత్సాహ
నవ వసంతోత్సహాలు
నింగికేగిసేల జరుపుకుందాం

ఉపసమరానికి తెర లేచింది...

ఉపసమరానికి తెర లేచింది ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసే సమయమసన్నమైంది
ప్రత్యేకవాదానికి పట్టం కడుతు
ప్రజావాణి వినిపించె పని మొదలయింది
మనకోసం మరణాన్ని ముద్దాడిన
విద్యార్థి వీరుల సాక్షిగా ప్రమాణాలు చేసి
రాజీనామాలు చేయకుండానే రంగంలోకి దిగుతు
తెచ్చేది మేమె, ఇచ్చేది మేమె
అంటూ తేల్చాల్సిన సమయంలో
తెల్లమొహం వేసే తెలివితక్కువ నాయకులకు
ఉన్న కన్నును పోడిచేస్తూనే
రెండు ప్రాంతాలు రెండు కళ్ళలాంటివి అంటు
రెండు నాల్కల ధోరణితో వ్యవహరించే
అటు, ఇటు కాని నాయకులకు
ఓటు ఓటులో
తెలంగాణా పోటు తెలిసేలా
తొడకొట్టి తెలంగాణా తెగువ తెలిసేలా
పోరు బిడ్డలకు పట్టం కడుతు
కోటిలింగాల కోన సాక్షిగా
మెట్ పల్లిలో మొదలెట్టి
ధర్మపురిలో దండోరా మ్రోగించి
వేములవాడలో విజయశంకరావం పూరించి
సిరిసిల్లలో సింహంలా గర్జించి
హుజురాబాద్ లో జూలు విదిల్చి
కరీంనగర్ అంత కదం త్రొక్కి
ఓరుగల్లు పచ్చిమాన పోరుబాట పట్టి
కొండ జాతి బిడ్డ కొమురం భీం
పోరాట స్పూర్తిగా
సిరిపూర్ కాగజ్ నగర్ లో కరంబిగించి కరవాలమెత్తి
చెన్నూర్ లో చెలరేగి
మంచిర్యాల్ లో మృదంగం మ్రోగించి
సిద్దిపేటలో శివమెత్తి
ఎల్లారెడ్డిలో తెలంగాణా జెండాలు ఎగరేసి
నిజామాబాద్ లో నింగికేగిసేల
పది ప్రాంతాల పలితాలు కావు ఇవి
పది జిల్లాల ప్రజల పటిష్టమైన కాంక్షని
పార్టిలన్నింటికి వినిపించేలా
పిరంగులు మ్రోగించి
పిడికిలి బిగించి
నినదించండి
మా వాదం తెలంగాణా
మా నినాదం తెలంగాణా

జై తెలంగాణా జై జై తెలంగాణా