ఉపసమరానికి తెర లేచింది ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసే సమయమసన్నమైంది
ప్రత్యేకవాదానికి పట్టం కడుతు
ప్రజావాణి వినిపించె పని మొదలయింది
మనకోసం మరణాన్ని ముద్దాడిన
విద్యార్థి వీరుల సాక్షిగా ప్రమాణాలు చేసి
రాజీనామాలు చేయకుండానే రంగంలోకి దిగుతు
తెచ్చేది మేమె, ఇచ్చేది మేమె
అంటూ తేల్చాల్సిన సమయంలో
తెల్లమొహం వేసే తెలివితక్కువ నాయకులకు
ఉన్న కన్నును పోడిచేస్తూనే
రెండు ప్రాంతాలు రెండు కళ్ళలాంటివి అంటు
రెండు నాల్కల ధోరణితో వ్యవహరించే
అటు, ఇటు కాని నాయకులకు
ఓటు ఓటులో
తెలంగాణా పోటు తెలిసేలా
తొడకొట్టి తెలంగాణా తెగువ తెలిసేలా
పోరు బిడ్డలకు పట్టం కడుతు
కోటిలింగాల కోన సాక్షిగా
మెట్ పల్లిలో మొదలెట్టి
ధర్మపురిలో దండోరా మ్రోగించి
వేములవాడలో విజయశంకరావం పూరించి
సిరిసిల్లలో సింహంలా గర్జించి
హుజురాబాద్ లో జూలు విదిల్చి
కరీంనగర్ అంత కదం త్రొక్కి
ఓరుగల్లు పచ్చిమాన పోరుబాట పట్టి
కొండ జాతి బిడ్డ కొమురం భీం
పోరాట స్పూర్తిగా
సిరిపూర్ కాగజ్ నగర్ లో కరంబిగించి కరవాలమెత్తి
చెన్నూర్ లో చెలరేగి
మంచిర్యాల్ లో మృదంగం మ్రోగించి
సిద్దిపేటలో శివమెత్తి
ఎల్లారెడ్డిలో తెలంగాణా జెండాలు ఎగరేసి
నిజామాబాద్ లో నింగికేగిసేల
పది ప్రాంతాల పలితాలు కావు ఇవి
పది జిల్లాల ప్రజల పటిష్టమైన కాంక్షని
పార్టిలన్నింటికి వినిపించేలా
పిరంగులు మ్రోగించి
పిడికిలి బిగించి
నినదించండి
మా వాదం తెలంగాణా
మా నినాదం తెలంగాణా
జై తెలంగాణా జై జై తెలంగాణా
No comments:
Post a Comment